Class 11 | CHEMISTRY |
Chapter | పదార్ధం స్ధితులు : వాయువులు,ద్రవ్యాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
వాయు అణువుల మధ్య ఉండే వివిధ రకాల అంతర అణుమూలాలను పేర్కొనండి.
బాయిల్ నియమాన్ని తెలిపి, దాని గణితాత్మక రూపం తెలపండి.
ఛార్లెస్ నియమాన్ని తెలిపి, దాని గణితాత్మక రూపం తెలపండి.
సమోష్ణోగ్రతరేఖలు అంటే ఏమిటి ?
పరమ ఉష్ణోగ్రత అంటే ఏమిటి ?
సంయపీడనరేఖలు అంటే ఏమిటి ?
పరమ శూన్య ఉష్ణోగ్రత అంటే ఏమిటి ?
అవొగ్రాడో నియమాన్ని తెలపండి.
స్ధిర ఘనపరిమాణ రేఖలు అంటే ఏమిటి ?
STP పరిస్ధితులను తెలపండి.
గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటే ఏమిటి ?
ఆదర్శవాయువు అంటే ఏమిటి ?
వాయు స్ధిరాంకం 'R' ను విశ్వవాయు స్ధిరాంకం అని ఎందుకు పిలుస్తారు ?
ఆదర్శవాయు సమీకరణాన్ని స్ధితి సమీకరణo అని ఎందుకు అంటారు ?
వాయు స్ధిరాంకం 'R' విలువను వివిధ ప్రమాణాల్లో తెలపండి.
ఒక వాయువు యొక్క సాంద్రత, మోలార్ ద్రవ్యరాసుల మధ్య సంబంధాన్ని తెలపండి.
గ్రాహం వాయు వ్యాపన నియమాన్ని తెలపండి.
`N_2,O_2,CH_4` వాయువుల్లో ఏది త్వరితంగా వ్యాపనం చెందుతుంది. ఎందువల్ల ?
సల్ఫర్ డయాక్సైడ్ కంటే మీధేన్ ఎన్ని రెట్లు త్వరితంగా వ్యాపనం చెందుతుంది ?
డాల్టన్ పాక్షిక పీడనాల నియమాన్ని తెలపండి.
ఒక వాయువు పాక్షిక పీడనానికి, దాని మోల్ భాగానికి గల సంబంధాన్ని తెలపండి.
నీటి ఆవిరి సంతృప్త బాష్పపీడనం అంటే ఏమిటి ?
వాయువుల అణుచలన సిద్ధాంతంలోని ఏ రెండు అంశాలు ఆదర్శ ప్రవర్తన నుంచి నిజవాయువుల విచలనాన్ని వివరించలేవు ?
చలద్వాయు సమీకరణాన్ని వ్రాసి, దానిలోని పదాలను తెలపండి.
అణు వాయువుల గతిజశక్తిని లెక్కకట్టుటకు సమీకరణాన్ని తెలపండి.
బోల్ట్జ్మన్ స్ధిరాంకం అంటే ఏమిటి ? దాని విలువను తెలపండి.
RMS వేగం అంటే ఏమిటి ?
సగటు వేగం అంటే ఏమిటి ?
గరిష్ట సంభావ్యత వేగం అంటే ఏమిటి ?
వాయు అణువుల వేగాలపై ఉష్ణోగ్రత ప్రభావమేమిటి ?
వాయు అణువుల గతిజశక్తిపై ఉష్ణోగ్రత ప్రభావమేమిటి ?
వాయు అణువుల RMS వేగం, సగటు వేగం, గరిష్ట సంభావ్యత వేగాల నిష్పత్తిని తెలపండి.
చలద్వాయు సమీకరణoలో RMS వేగాన్ని ఎందుకు తీసుకుంటారు ?
సంపీడన గుణకం అంటే ఏమిటి ?
బాయిల్ ఉష్ణోగ్రత అంటే ఏమిటి ?
సందిగ్ధ ఉష్ణోగ్రత అంటే ఏమిటి ?`CO_2` కు దాని విలువ ఇవ్వండి.
సందిగ్ధ ఘనపరిమాణం అంటే ఏమిటి ?
సందిగ్ధ పీడనం అంటే ఏమిటి ?
సందిగ్ధ స్ధిరాoకాలు అంటే ఏమిటి ?
ద్రవం బాష్పపీడనాన్ని నిర్వచించండి.
సాధారణ, ప్రమాణ బాష్పీభవన ఉష్ణోగ్రతలు అంటే ఏమిటి ? `H_2 O`కు వాటి విలువలు ఇవ్వండి.
కొండల మీద వంట చేయడానికి ప్రెజర్ కుక్కర్ లను ఎందుకు వాడతారు ?
తలతన్యత అంటే ఏమిటి ?
దళ ప్రవాహం అంటే ఏమిటి ?
స్నిగ్ధతా గుణకం అంటే ఏమిటి ?దాని ప్రమాణాలు తెలపండి.
బాయిల్ నియమాన్ని తెలిపి, వివరించండి.
ఛార్లెస్ నియమాన్ని తెలిపి, వివరించండి.
ఆదర్శ వాయు సమీకరణాన్ని ఉత్పాదించండి.
గ్రాహం వాయు వ్యాపన నియమాన్ని తెలిపి, వివరించండి.
డాల్టన్ పాక్షిక పీడనాల నియమాన్ని తెలిపి, వివరించండి.
చలద్వాయ సమీకరణం నుండి (a )బాయిల్ నియమం (b )ఛార్లెస్ నియమం రాబట్టండి.
చలద్వాయ సమీకరణం నుండి (a )గ్రాహం నియమం (b )డాల్టన్ నియమం రాబట్టండి.
వాయు అణువుల గతిజశక్తికి సమీకరణాన్ని ఉత్పాదించండి.
వాయు అణువుల (a ) rms వేగం (b ) సగటు వేగం (c ) గరిష్ట సంభావ్యత వేగాలను నిర్వచించి, వాటి మధ్య గల సంబంధాన్ని తెలపండి.
వాండర్ వాల్స్ స్ధిరాoకాల భౌతిక ప్రాధాన్యతను వివరించండి.
ద్రవాల తలతన్యత అంటే ఏమిటి ?ద్రవాల తలతన్యతపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని వివరించండి.
ద్రవాల బాష్ప పీడనం అంటే ఏమిటి ?ద్రవాల బాష్ప పీడనం, వాటి బాష్పీభవన ఉష్ణోగ్రతల మధ్య సంబంధాన్ని తెలపండి.
స్నిగ్ధత, స్నిగ్ధతా గుణకాలను వివరించండి. ద్రవాల స్నిగ్ధత ఉష్ణోగ్రత తో ఏవిధంగా మారుతుంది ?
అంతర అణుబలాలను వివరించండి.
బాయిల్, ఛార్లెస్, అవొగాడ్రో నియమాలను తెలిపి, ఆదర్శ వాయు సమీకరణాన్ని ఉత్పాదించండి.
వాయువుల వ్యాపనంపై వ్యాసం రాయండి.
డాల్టన్ పాక్షిక పీడనాల నియమాన్ని తెలిపి, వివరించండి.
వాయు అణుచలన సిద్ధాంతంలోని ముఖ్యాంశాల్లను రాయండి.
చలద్వాయు సమీకరణం నుండి చార్లెస్ నియమం రాబట్టండి.
మాక్స్ వెల్ - బోల్ట్జ్ మెన్ అణువేగాల పంపిణీ వక్రరేఖలను వివరించండి. ఈ రేఖల ఆధారంగా తెలిసిన అంశాలేమిటి ? అణువేగాల పంపిణీ ఉష్ణోగ్రత ప్రభావాన్ని చర్చించండి.
నిజ వాయువుల ప్రవర్తన,ఆదర్శ వాయు ప్రవర్తన నుంచి విచలనాన్ని వివరించండి.
వాండర్ వాల్స్ స్ధితి సమీకరణాన్ని ఉత్పాదించండి. వాండర్ వాల్స్ సమీకరణం ప్రాముఖ్యతను వివరించండి.
వాయువుల ద్రవీకరణలో ఇమిడి వున్న సూత్రాన్ని వివరించండి.
ద్రవాల క్రింది ధర్మాలను వివరరయించండి. a) బాష్ప పీడనం b) తలతున్యత c) స్నిగ్ధత
`30^circC` వద్ద `500 dm^3 `ఘనపరిమాణం 1 bar పీడనం గల గాలిని `200 dm^3` ఘనపరిమాణానికి సంపీడనం చెందించడానికి కావలసిన కనిష్ట పీడనం ఎంత ?`
`35^circC `1.2 బార్ పీడనం వద్ద 120 ml. ఘనపరిమాణం గల పాత్రలో కొంత వాయువు ఉన్నది. ఈ వాయువును 180 ml. ఘనపరిమాణంగల పాత్రలోనికి మర్చినప్పుడు దాని పీడనం ఎంత ఉంటుంది ?
pV = nRT స్ధితి సమీకరణాన్ని ఉపయోగించి, ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు సాంద్రత దాని పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుందని చూపండి.
`0^circC` వద్ద 2 బార్ పీడనం వద్ద ఒక వాయువ్య ఆక్సైడ్ సాంద్రత, 5 బార్ పీడనం వద్ద డై నైట్రోజన్ సాంద్రత సమానమవుతుంది. ఆక్సైడ్ మోలార్ ద్రవ్యరాశి ఎంత ?
`27^circC `వద్ద 1 గ్రామ్ ఆదర్శ వాయువు A 2 బార్ పీడనం కలిగి ఉన్నది. అదే ఉష్ణోగ్రత వద్ద అదే పాత్రలోనికి 2 g మరొక ఆదర్శ వాయువు Bను పంపినపుడు పీడనం 3 బార్ కు పెరిగింది. A,B వాయువుల మోలార్ ద్రవ్యరాసుల సంబంధాన్ని కనుక్కోండి.
డ్రైనేజ్ లను శుభ్రపరిచే డ్రైనెక్స్ కొద్ది పాళ్లలో అల్యూమినియం కలిగి ఉంది సోడాతో చర్య నొంది డైహైడ్రోజన్ ను ఇస్తుంది. `20^circC` 1 బార్ పీడనం వద్ద 0.15 గ్రా అల్యూమినియం చర్యనొందిన, ఎంత ఘనపరిమాణం గల డైహైడ్రోజన్ విడుదలవుతుంది ?
`27^circC `వద్ద `9 dm ^3` పాత్రలో 3.2 గ్రా మీధేన్, 4.4 గ్రా కార్బన్డైఆక్సైడ్ కలిగి ఉన్న వాయు మిశ్రమం కలిగించే పీడనం ఎంత ?
`27^circC ` వద్ద 1 L పాత్రలోనికి 0.8 బార్ పీడనం కలిగిన 0.5 ల్ డైహైడ్రోజన్, 0.7 బార్ కలిగిన 2.0 డైఆక్సిజన్ పంపినపుడు ఆ వాయువు కలిగించే పీడనం ఎంత ?
`27^circC `, 2 బార్ పీడనం వద్ద ఒక వాయువు సాంద్రత `5.46 g /dm^3` ఉంటే, STP వద్ద దాని సాంద్రత ఎంత ?
`10.546circC`, 0.1 బార్ పీడనం వద్ద 34.05 ml. ఫాస్ఫరస్ బాష్ప భారం 0.0625 g ఉంటే,ఫాస్ఫరస్ మోలార్ ద్రవ్యరాశి ఎంత ?
`27^circC ` వద్ద ప్రయోగం కగసేటప్పుడు ఒక విద్యార్ధి పాత్రలో చర్యా మిశ్రమాన్ని తీసుకోవడం మర్చిపోయి, పాత్రను వేడి చేస్తున్నాడు. కొంత సమయానికి తప్పు తెలుసుకుని పాత్ర ఉష్ణోగ్రతను పైరో మీటర్ ద్వారా చేస్తే, ఉష్ణోగ్రత `477^circC` ఉన్నది. ఎంత భాగం గాలి బయటకు పోయిందో లెక్కకట్టండి.
3.32 బార్ పీడనం వద్ద 4.0 మోల్ ల వాయువు `5 dm ^3` ఘనపరిమాణం ఆక్రమించియా, ఆ వాయువు ఉష్ణోగ్రతను లెక్కకట్టండి. `(R = 0.083 బార్ dm^3 K^-1 mol^-1.)`
1.4 g డైనైట్రోజన్ వాయువులో ఉన్న ఎలక్ట్రాన్ ల సంఖ్యను లెక్క కట్టండి.
ప్రతి సెకనుకు `10^10` ధాన్యపు గింజలను పంచుకుంటూ పోతే అవొగాడ్రో సంఖ్య ధాన్యపు గింజలను పంచటానికి ఎంత కాలం పడుతుంది.
ఒక సన్నని రంధ్రం గుండా అమ్మోనియా వాయువు వ్యాపనం రేటు `0.5 lit min ^(-1)`. అదే పరిస్ధితులలో క్లోరిన్ వాయువు వ్యాపనం రేటు ఎంత ?
`CO_2`,కల_2 వాయువుల సాపేక్ష వ్యాపనం రెట్లు కనుక్కోండి.
150 ml. కార్బన్ మోనాక్సైడ్ నిస్సరణం చెందడానికి 25 సె||కాలం పడితే అదే కాలంలో ఎంత ఘనపరిమాణం గల మీధేన్ వాయువు నిస్సరణం చెందుతుంది ?
ఒక 100 మీటర్ల గొట్టంలోకి 'A' వైపు నుంచి హైడ్రోజన్ క్లోరైడ్, 'B' వైపయి నుంచి అమ్మోనియా వాయువును ఒకే పరిస్ధితులలో పంపితే, 'A' నుంచి ఎంత దూరంలో రెండు వాయువులు కలుసుకుంటాయి ?
`27^circC `వద్ద `1 dm ^3 `పాత్రలో ఉన్న 8 గ్రా. డైఆక్సిజన్, 4 గ్రా. డైహైడ్రోజన్ వాయువుల మిశ్రమం కఇగినచ్చే పీడనాన్ని లెక్కించండి.` (R = 0.083 బార్ dm ^3 K^-1 mol ^-1)`
`27^circC ` వద్ద `5 dm ^3` పాత్రలో ఉన్న 3.5 గ్రా. డైనైట్రోజన్, 3.0 గ్రా. డైహైడ్రోజన్, 8.0 గ్రా. డైఆక్సిజన్ వాయువుల మిశ్రమం కలిగించే మొత్తం పీడనాన్ని కనుక్కోండి. `(R = 0.083 బార్ dm^3K^-1 mol ^-1)`.
స్ధాన భ్రంశం చెందిన గాలి ద్రవ్యరాశి, బెలూన్ ద్రవ్యరాసుల మధ్య బేధాన్ని పేలోడ్ గా వ్యవహరిస్తారు.`27^circC`, 11.6 బార్ పీడనం వద్ద 10 మీ వ్యాసార్ధం, 100 kg ద్రవ్యరాశి గల, బెలూన్ ను హీలియం వాయువుతో నింపినప్పుడు ఒక బెలూన్ ను పేలోడ్ ను లెక్కించండి.` (గాలి సాంద్రత 1.2 kg m ^-3 , R = 0.083 బార్ dm ^3 K^-1 mol ^-1)`.
`31.1^circC`,1 బార్ పీడనం వద్ద 8.8 g `CO_2` వాయువు ఆక్రమించే ఘనపరిమాణాన్ని లెక్కించండి.
`95^circC` వద్ద 2.9 g ద్రవ్యరాశిగల ఒక వాయువు ఆక్రమించే ఘనపరిమాణం, అదే పీడనం వద్ద `17^circC` వద్ద 0.184 g డైహైడ్రోజన్ ఆక్రమించే ఘనపరిమాణానికి సమానం. అయితే వాయువు మోలార్ ద్రవ్యరాశి ఎంత ?
బార్ పీడనం వద్ద డైహైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల మిశ్రమంలో డైహైడ్రోజన్ భార్యశాతం 20% అయినా డైహైడ్రోజన్ పాక్షిక పీడనాన్ని లెక్కించండి.
`pV^2T^2/n` విలువకు SI ప్రమాణం ఏమిటి ?
ఛార్లెస్ నియమం ప్రకారం `- 273^circC` ను అత్యల్ప ఉష్ణోగ్రత్తగా ఎందుకు భావిస్తారో వివరించండి.
కార్బన్ డై ఆక్సైడ్, మీధేన్ ల సందిగ్ధ ఉష్ణోగ్రతలు వరుసగా `31.1^circC`, `- 81.9^circC` అయిన ,వీటిలో ఏ వాయువులో బలమైన అంతర అణు ఆకర్షణ బలాలుంటాయి ?
గాలిని `25^circC` నుండి `0circC` కు చల్లబరిచిన, అణువుల rms వేగంలో కలిగే తగ్గుదలను లెక్కించండి.
`27^circC` వద్ద `SO_2` వాయువు RMS వేగం,సగటు వేగం, గరిష్ట సంభావ్యతా వేగలను కనుక్కోండి.
`27^circC` వద్ద `O_2 RMS`, సగటు, గరిష్ట సంభావ్యతా వేగాలను కనుక్కోండి.
`27^circC` వద్ద CO_2 RMS, సగటు, గరిష్ట సంభావ్యతా వేగాలను కనుక్కోండి.
Exercise questions and complete solutions for chapter పదార్ధం స్ధితులు : వాయువులు,ద్రవ్యాలు of VGS CHEMISTRY (TELUGU) of Class 11