Class 11 | CHEMISTRY |
Chapter | స్టాయికియోమెట్రి |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
540 గ్రాముల గ్లూకోజ్ లో ఎన్ని మోల్ ల గ్లూకోజ్ ఉంది?
0.1 మోల్ సోడియం కార్బోనేటు భారాన్ని లెక్క కట్టండి.
5.23 గ్రా.ల గ్లూకోస్ లో ఎన్ని అణువులు ఉంటాయి ?
S.T.P వద్ద `1.12x10^7` CC ల వాయువులో ఉండే అణువుల సంఖ్యను లెక్కించండి.
ఒక సమ్మేళనం అనుభావిక ఫార్ములా `CH_2O`. దాన్ని అణు భారం 90. ఆ సమ్మేళనం అణు ఫార్ములాను కనుక్కోండి.
0.795 గ్రా.ల CuO ని Cu, `H_2O` లుగా క్షయకరణం చేయడానికి STP వద్ద ఘ.ప. `H_2` అవసరం అవుతుంది.
100 ml ల ఎసిటిలీన్ ని పూర్తిగా దహనం చేయడానికి కావాలసిన `O_2` ఘన పరిమాణాన్ని STP వద్ద లెక్క కట్టండి.
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రాన్ సాంద్రత తగ్గుదలను ఆక్సీకరణం అని, ఎలక్ట్రాన్ సాంద్రత పెరగడాన్ని క్షయకరణం అనీ అంటారు. దీనిని మీరు సమర్థించండి.
ఆక్సీకరణ - క్షయకరణ భావం అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
సోడియమ్ సల్ఫేట్ (`na_2 SO_4`) లోని వివిధ మూలకాల ద్రవ్యరాశి శాతాలను గణించండి
సార్దక అంకెలు అంటే మీరు ఏమి చెబుతారు?
కాంతివేగం `3.0x10^8circC m.s^-1` అయితే 2 నానో సెకండ్లలో అది ప్రయాణించే దూరాన్ని లెక్కించండి.
సోడియంకార్బొనేట్ తయారీ నెలకు సుమారు 424x `10^6`g. మిథైల్ ఆల్కహాల్ 320x10g. అయితే ఏది ఎక్కువ మోలు తయారవుతుంది?
1.5 atm పీడనం, `127`^ circC` ల వద్ద 0.112 లీటర్ల ), `O_2` పూర్తిగా చర్య జరిపి `CO_2`, ఏర్పడడానికి STP వద్ద CO ఘనపరిమాణం కనీసం ఎంత కావాలి?
కర్బన సమ్మేళనంలోని మూలకాల రసాయన విశ్లేషణ చేశారు. భారాత్మకంగా వాటి సంఘటన శాతాలు కింది విధంగా ఉన్నాయి. కార్బన్ 10.06%, హైడ్రోజన్ = 0.84%, క్లోరిన్ = 89.10% సమ్మేళనం అనుభావిక ఫార్ములాను కనుక్కోండి.
ఒక కర్బన సమ్మేళనాన్ని విశ్లేషించగా కింది సంఘటన శాతాలను ఇచ్చింది. కార్బన్ 14.5%, హైడ్రోజన్ 1.8%, క్లోరిన్ 64.46%, ఆక్సిజన్ 19.24% అయితే సమ్మేళనం అనుభావిక ఫార్ములా కనుక్కోండి .
కింది సంఘటన శాతం ఉన్న సమ్మేళనపు అనుభావిక ఫార్ములాను కనుక్కోండి. పొటాషియం K =26.57%, క్రోమియం Cr = 35.36%, ఆక్సిజన్ (O) 38.07% [K, Cr, O ల పరమాణు భారాలు వరుసగా 39, 52, 16 ఉంటాయి ] అనుభావిక ఫార్ములా కనుక్కోండి.
ఒక కర్బన సమ్మేళనం 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్, 85.1% బ్రోమీన్ ఉంటాయి. దాని అణుభారం 187.9 అణుఫార్ములాను కనుక్కోండి.
ఒక కార్బనిక సమ్మేళనం అనుభావిక ఫార్ములా `CH_2`, Br.O.188 g ల సమ్మేళనం `14^circC` ఉష్ణోగ్రత వద్ద, 752 mm ల పీడనం వద్ద 24.2 c.cల గాలిని స్థానభ్రంశం చేసింది. అయితే సమ్మేళనం అణుఫార్ములాను కనుక్కోండి. (జలభాష్ప పీడనం `14^circC` వద్ద 12mm)
420 Kg ల HCIని తయారు చేయడానికి 90% `H_2``SO_4`, ఎంత అవసరమవుతుంది?
ఒక అంతరిక్ష ప్రయాణీకుడికి 34g ల సుక్రోజ్ ను దహనం చేయడం వల్ల వచ్చే శక్తి తన శరీరానికి ఒక గంటకు అవసరమవుతుంది. ఒక రోజుకు తనకు కావలసిన శక్తి కోసం అతడు ఎంత ఆక్సిజన్‌ను తనతో తీసుకుపోవాలి?
4 గ్రా. `CaCo_3`ని వేడిచేస్తే STP వద్ద వెలువడే ` `CO_2` ఘ.ప. ఎంత?
50 గ్రా. గంధక నమూనా (S) గాలిలో మండిస్తే 4% నమూనా మిగిలిపోయింది. STP వద్ద 21% ఆక్సిజన్ ఘ.ప. గల గాలి ఘ.ప. లెక్కించండి.
`20^circC`, 770mm Hg పీడనం వద్ద 10 cc మీథేన్ ను పూర్తిగా దహనం చేయడానికి STP పరిస్థితిలో కావలసిన ఆక్సిజన్ ఘన పరిమాణాన్ని లెక్కించండి.
`27^circC`, 760 mm Hg పీడనం వద్ద 0.6 గ్రా. మెగ్నీషియంపై అధిక సజల HCl సమక్షంలో వెలువడే `H_2` ఘ.ప. గణించండి.
అంశమాపక పద్ధతిలో గాల్వనో ఘటంలో రిడాక్స్ చర్యల పాత్రను వివరించండి.
మోలార్ ద్రవ్యరాశిని నిర్వచించి వివరించండి.
కంప్రపోర్షనేషన్ (సహానుపాత) చర్యలను ఉదాహరణలతో వివరించండి.
82.0245 గ్రా. మోల్^-1 మోలార్ ద్రవ్యరాశి గల సోడియం ఎసిటేట్ 500 ml 0.375 మోలార్ జల ద్రావణాన్ని తయారుచేయడానికి కావలసిన సోడియం ఎసిటేటు ద్రవ్యరాశిని గణించండి.
20 గ్రా. షుగర్ (`CH_12H_22O_11`) ని 2L నీటిలో కరిగిస్తే వచ్చే గాఢత ఎంత?
ఈ క్రింది వాటిలో ఎన్ని సార్థక అంకెలు ఉన్నాయో తెలపండి.
0.040 మోల్ భాగం ఉన్న ఇథనోల్ జల ద్రావణంలో ఇథనోల్ మొలారిటీని గణించండి (నీటి సాంద్రతను ఒకటిగా తీసుకోండి)
వెల్డింగ్ చేసే వాయు ఇంధనంలో కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి. కొద్ది నమూనాను ఆక్సిజన్ సమక్షంలో మండిస్తే 3.38g కార్బన్ డై ఆక్సైడ్, 0.690g నీరు ఏర్పడ్డాయి. మరి ఏ యితర ఉత్పన్న పదార్థం రాలేదు. 10.0 L (STP వద్ద కొలిచిన) ఈ వెల్డింగ్ వాయువు 11.6g బరువు ఉన్నది. దాని (1) అనుభావిక ఫార్ములా (ii) వాయువు ద్రవ్యరాశి (til) అణుఫార్ములా గణించండి.
కాల్షియం కార్బొనేట్ సజల HClతో చర్య జరిపి `CaCL_2`ను, `CO_2` ను ఇచ్చే రసాయన చర్య, `CaCL_3`(ఘ)+2HCI(జల) `CaCL_2` (జల)- `CO_2`,(వా)+ `H_2O`(ద్ర). 25mle 0.75M HCl సజల ద్రావణంతో పూర్తిగా చర్య జరగడానికి కావలసిన `CaCO_3` ద్రవ్యరాశి ఎంత?
50ml 0. 1N సోడియం కార్బొనేట్ ద్రావణానికి 150ml నీటిని కలిపితే వచ్చిన ద్రావణం నార్మాలిటీని గణించండి.
200 mL 0.2N NaOH ద్రావణాన్ని తటస్థీకరించడానికి కావలసిన 0. 1N సల్ఫ్యూరిక్ ఆమ్లం ఘనపరిమాణాన్ని గణించండి.
250 mL ల 0.2 N NaOHని తటస్థీకరించడానికి ఎంత నార్మాలిటీ గల 50 mL `H_2SO_4`, కావాలి?
`NaH_2PO_4` మూలకాల ఆక్సీకరణ స్థితులు వ్రాయండి.
`NaHSO_4` మూలకాల ఆక్సీకరణ స్థితులు వ్రాయండి.
`H_4P_2O_7` మూలకాల ఆక్సీకరణ స్థితులు వ్రాయండి.
`K_2MnO_4` మూలకాల ఆక్సీకరణ స్థితులు వ్రాయండి.
`CaO_2` మూలకాల ఆక్సీకరణ స్థితులు వ్రాయండి.
`NaBH_4` మూలకాల ఆక్సీకరణ స్థితులు వ్రాయండి.
`H_2S_2O_7` మూలకాల ఆక్సీకరణ స్థితులు వ్రాయండి.
`KAl(SO_4)_2 12H_2O` మూలకాల ఆక్సీకరణ స్థితులు వ్రాయండి.
`MnO_4` మూలకాల ఆక్సీకరణ స్థితులు వ్రాయండి.
`Kl_3` మూలకాల ఆక్సీకరణ స్థితులను వివరించండి.
`H_2S_4O_6` మూలకాల ఆక్సీకరణ స్థితులను వివరించండి.
`Fe_3O_4` మూలకాల ఆక్సీకరణ స్థితులను వివరించండి.
ఫ్లోరిన్ మంచుతో చర్య జరిపి కింది మార్పును ఇస్తుంది. `H_2O` (ఘ) + `F_2` (వా) – 2HF(వా) + HOF(వా) దీనిని రిడాక్సు చర్యగా చూపండి
`H_2SO_5, Cr_2, O_7^2`లో `NO_3` లలో S, Cr, Nల ఆక్సీకరణ సంఖ్యలను, నిర్మాణాలను వ్రాయండి.
ఐరన్ సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
మెర్క్యూరీక్లోరైడు సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
క్లోరైడు సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
నికెల్ sulpateసంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
సల్ఫేటు సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
tin ఆక్సైడ్ సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
tin ఆక్సైడ్ సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
థాలియంsulphate సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
సల్ఫేటు సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
ఐరన్ సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
సల్ఫేటు సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
క్రోమియం oxide సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
ఆక్సైడ్ సంయోగ పదార్థాల ఫార్ములాలు వ్రాయండి.
కార్బన్ - 4 నుంచి + 4 వరకు నైట్రోజన్ - 3 నుండి + 5 వరకు ఆక్సీకరణ స్థితులు చూపే పదార్థాల పట్టిక ఇవ్వండి.
`SO_2H_2O_2` లు ఆక్సీకరణులుగాను, క్షయకరణులుగాను పనిచేస్తాయి. కాని `HNO_3` కేవలం ఆక్సీకరణిగానే పనిచేస్తుంది. ఎందువల్ల ?
`AgF_2` చాలా అస్థిరమైనది. అది ఏర్పడితే ఒక బలమైన ఆక్సీకరణిగా పనిచేస్తుంది ఎందువల్ల?
ఒక ఆక్సీకరణి, ఒక క్షయకరణిల మధ్య చర్య జరిగితే క్షయకరణి అధికంగా ఉన్నపుడు తక్కువ ఆక్సీకరణ స్థితి సంయోగ పదార్థం, ఆక్సీకరణి అధికంగా ఉంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితి సంయోగ పదార్థం ఏర్పడతాయి. దీనిని కనీసం మూడు ఉదాహరణలతో వివరించండి.
క్షారీకృత `KMnO_4` అమీకృత `KMnO_4` లు ఆక్సీకరణులైనా టోలీన్ నుంచి బెంజోయిక్ ఆమ్లం తయారీలో ఆల్కహాలిక్ `KMnO_4` ను ఆక్సీకరణిగా వాడతారు. ఎందువల్ల ? చర్యకు తుల్య ఆక్సీకరణ - క్షయకరణ సమీకరణం రాయండి.
మూలక రసాయన మిశ్రమంలో క్లోరైడ్ ఉంటే దానికి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపినపుడు ఘాటైన వాసన గల HCl వాయువు వెలువడుతుంది. ఐతే మిశ్రమంలో బ్రోమైడ్ లవణం ఉంటే ఎర్రటి బ్రోమిన్ వస్తుంది. ఎందువల్ల?
2AgBr(ఘ)+`C_6H_6O_2` - 2Ag(ఘ)+ 2HBr(జల)+`C_6H_4O2`(జల)
HCHO (ద్ర)+`2[Ag(NH_3)_2]`(జల)+30H (జల) - 2Ag(ఘ)+HCOO (జల)+`4NH_3`(జల)`2H_2O`(ద్ర)
HCHO(ద్ర)+`2Cu^(++)`(జల)+`50H^-`(జల) -rarr Cu_2O(ఘ)+`HCOO^-`(జల)+3H_2O(ద్ర)
`N_2H_4` (ద్ర)+`2H_2O_2`(ద్ర) -rarr `N_2`(వా)+`4H_2O`(ద్ర)
Pb(ఘ)+`PbO_2`(ఘ)+`2H_2SO_4`(జల) -rarr `PbSO_4`(ఘ)+2H_2O(ద్ర)
హాలోజన్ లలో ఫ్లోరిన్ బలమైన ఆక్సీకరణి. హైడ్రోహాలిక్ సంయోగ పదార్థాలలో హైడ్రో అయోడిక్ ఆమ్లం బలమైన క్షయకరణి వివరించండి.
కింది చర్య ఎందుకు జరుగుతుంది ? `XeO_6^4-` (జల)+`6H^+`(జల) -rarr `XeO_3`(వా)+3H_2O(ద్ర) ఈ చర్య నుంచి `Na_4XeO_6` అనే పదార్ధం (దీనిలో `XeO_6^4-`ఒక విభాగం)గురించి ఏమని నిర్ధారించవచ్చు?
`H_3PO_2` (జల)+`4AgNO_3`(జల)+`2H_2O`(ద్ర) -rarr `H_3PO_4`(జల)+4Ag(ఘ)+`4HNO_3`
`H_3PO_2` (జల)+`2CuSO_4`(జల)+`2H_2O`(ద్ర) -rarr `H_3PO_4`(జల)+2Cu(ఘ)+`2H_2SO_4`(జల)
`C_6H_5CHO`(ద్ర)+`2[Ag(NH_3)_2`(జల)+`3OH^-`(జల) -rarr `C_6H_5COO^-`(జల)+2Ag(ఘ)+`4NH_3`(జల)+2H_2O`(ద్ర)
`MnO_4^-`(జల)+`I^-`(జల) ---rarr `MnO_2`(ఘ)+`I_2`(ఘ) (క్షార యానకంలో)
`MnO_4^-`(జల)+`SO_2`(వా) ---rarr `Mn_2`(జల)+`HSO_4^-`(జల) (ఆమ్లా ద్రావణంలో)
`H_2O_2`(జల)+`Fe^2+`(జల) ---- >`Fe^3+`(జల)+`H_2O`(ద్ర) (ఆమ్లా ద్రావణంలో)
`Cr_2O_7^2-`+SO_2(వా) ---rarr `Cr^3+`(జల)+`SO_4^2-`(జల) (ఆమ్లా ద్రావణంలో)
`Cl_2O_7`(వా)+`H_2O_2` ---- >`ClO_2^-` (జల)+O_2(వా)+`H^+`
ఈ చర్య ద్వారా ఏమి తెలుస్తోంది ? (CN)_2 (వా)+2OH(జల) - CN (జల)+CNO(జల)+H_2O(ద్ర)
`Mn^3+` అయాన్ ద్రావణంలో అస్థిరంగా ఉండి, అననుపాతం చెంది `Mn^2^+`, `MnO_2`, H అయాన్ లను ఇస్తుంది. ఈ చర్యకు తుల్య అయానిక సమీకరణాన్ని రాయండి.
Cs, Ne, I, F ఋణ ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శించే మూలకం ఏది ?
Cs, Ne, I, F ధన అక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శించే మూలకం ఏది ?
Cs, Ne, I, F ధన, ఋణ ఆక్సీకరణ స్థితులు రెండింటినీ ప్రదర్శించే మూలకం ఏది ?
Cs, Ne, I, F ధన, ఋణ ఆక్సీకరణ స్థితులలో దేనిని కూడా ప్రదర్శించని మూలకం ఏది ?
తాగునీటిని శుద్ధి చేయటానికి క్లోరిన్ ను వాడతారు. అధిక క్లోరిన్ హానికరమైనది. అధికంగా ఉన్న క్లోరిన్ ను సల్ఫర్ డై ఆక్సైడ్ తో చర్య నొందించి తొలగిస్తారు. నీటిలో జరిగే ఈ ఆక్సీకరణ క్షయకరణ మార్పుకు తుల్య సమీకరణాన్నివ్వండి.
పుస్తకంలో ఇచ్చిన ఆవర్తనపట్టికను పరిశీలించి అననుపాత చర్యలను ప్రదర్శించే అలోహాలను ఎంపిక చేయండి.
పుస్తకంలో ఇచ్చిన ఆవర్తనపట్టికను పరిశీలించి అననుపాత చర్యలను ప్రదర్శించే మూడు లోహాలను ఎంపిక చేయండి.
ఆస్వాల్డ్ పద్దతిలో నత్రికామ్లం తయారుచేసే చర్యల్లో మొదటి అంచెలో అమ్మోనియా ఆక్సిజన్ తో ఆక్సీకరణం చెంది నైట్రిక్ ఆక్సైడ్, నీటి ఆవిరి వస్తాయి. చర్యను 10.0 గ్రా. అమ్మోనియా, 20.0 గ్రా. ఆక్సిజన్ తో జరిపితే గరిష్ఠంగా ఎంత నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది.
క్రింది లోహాలను వాటి లవణాల నుంచి ఒకదానితో ఒకటి స్థానభ్రంశం చెందించే క్రమంలో అమర్చండి. Al, Cu, Fe, Mg, Zn.
క్షార యానకంలో పర్మాంగనేట్ అయాన్, అయోడైడ్ (`1^-`) అయాన్ ను ఆక్సీకరణం చేసి, అయొడిన్ (`l_2`), మాంగనీస్ డై ఆక్సైడ్ (`MnO_2`) ఇచ్చే చర్యకు తుల్య అయానిక సమీకరణాన్ని రాయండి.
ఆమ్ల యానకంలో పర్మాంగనేట్, సల్ఫైట్ అయాన్ లను సల్ఫేట్ అయాన్ లుగా ఆక్సీకరణ చేసే చర్యకు తుల్య సమీకరణాన్ని రాబట్టండి.
ఆమ్లయానకంలో ఆక్జాలిక్ ఆమ్లం, పర్మాంగనేట్ అయాన్ తో `Mn^2^+` గా అక్సీకరించబడుతుంది. అయాన్ -ఎలక్ట్రాన్ పద్ధతిలో తుల్యం చేయండి.
ఫాస్ఫరస్ ను NaOH ద్రావణంలో వేడి చేస్తే ఫాస్ఫేన్ `PH_3`, `H_2PO_2`-, లను ఇస్తుంది. తుల్య సమీకరణాన్ని వ్రాయండి.
EXERCISE questions and complete solutions for chapter స్టాయికియోమెట్రి of VGS CHEMISTRY (TELUGU) of Class 11