Class 10 | MATHS |
Chapter | వర్ల నమీకరణాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 29 |
Academic Year | 2023-24 |
రాణి వద్ద ఒక చతురస్రాకారపు లోహపు రేకు గలదు. పటంలో చూపిన విధంగా దీని నాలుగు మూలల నుంచి 9 సెం.మీ, భుజంగల చతురస్రాలను తొలగించి మిగిలిన భాగంతో ఒక మూతలేని పెట్టెను తయారుచేసింది. ఇలా తయారైన పెట్టె యొక్క ఘనపరిమాణము 144 ఫఘ.సెం.మీ. అయిన మొదట తీసుకున్న లోహపు రేకు యొక్క భుజం పొడవును కనుగొనగలమా ?
క్రింది వానికి సరియగు సమీకరణాలను రాయుము / కనుగొనుము. రాజు మరియు రాజేందర్ ఇద్దరి వద్ద కలిపి 45 గోళీలు కలవు. అయితే ఇద్దరూ చెరి 5 గోళీలను పోగొట్టుకున్నారు. ఇద్దరి వద్ద మిగిలిన గోళీల సంఖ్య యొక్క లబ్ద్బము. 124 అయిన ఇద్దరి వద్ద మొదట వున్న గోళీల సంఖ్యను కనుగొనుటకు అవసరమయ్యే సమీకరణమును కనుగొనుము/ రాయము.
ఒక లంఐకోణ త్రిభుజము యొక్క కర్ణము 25 సెం.మీ, మిగిలిన రెండు భుజాల పొడవుల ఖేదము 5 సెం.మీ. అని ఇవ్వబడింది. అయిన మిగిలిన రెండు భుజాల పొడవులను కనుగొనుటకు అవసరమయ్యే సమీకరణమును రాయుము.
క్రించివి వర్గసమీకరణాలేమో పరిశీలించండి. `(x-2)^(2) + 1 =2x-3`
క్రించివి వర్గసమీకరణాలేమో పరిశీలించండి. `x(x + 1) + 8 = (x + 2) (x-2)`
క్రించివి వర్గసమీకరణాలేమో పరిశీలించండి. `x(2x + 3) =x^(2) +1`
క్రించివి వర్గసమీకరణాలేమో పరిశీలించండి. `(x + 2)^(3) =x^(3)-4`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలో, కాదో తెలపండి. `x^(2) -6x-4=0`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలో, కాదో తెలపండి. `x^(3) - 6x^(2) + 2x-1=0`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలో, కాదో తెలపండి. `7x = 2x^(2)`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలో, కాదో తెలపండి. `x^(2) + 1/x^(2) =2`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలో, కాదో తెలపండి. `(2x +1) (3x+1) = b(x-1) (x-2)`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలో, కాదో తెలపండి. `3y^(2) = 192`
కారణాంక పద్ధతిని `2x^(2) - 5x + 3 = 0` యొక్క మూలాలను కనుగొనుము.
`x -1/3x =1/6` వర్గ సమీకరణం యొక్క మూలాలను కనుగొనుము.
శీర్షిక (పాఠ్యపుస్తకంలో) చర్చించిన సమస్యలోని (పేక్షడుల కొరకు వదిలిన ఖాళీ స్థలము యొక్క వెడల్పును కనుగొనుము. చర్చించిన సమస్య : కస్పా పురపాలక పాఠశాల క్రీడల కమిటి పాఠశాల ఆవరణలో 29 మీ. x 16 మీ. కొలతలతో ఒక ఖో-ఖో కోర్టును నిర్మించాలని భావించింది. ఇందుకుగాను వారికి 558 చ.మీ. వైశాల్యం గల ఒక దీర్ధ చతురస్రాకార స్థలం అందుబాటులో ఉంది. అందువల్ల వారు ఖో-ఖో కోర్టు చుట్టూ ప్రేక్షకుల కొరకు కొంత ఖాళీ స్థీలమును కూడా యొక్క వెడల్పు కోర్టు చుట్టూ ఒకే విధంగా వుండేటట్లు వదిలితే దాని వెడల్పు ఎంత వుండాలి ?
1మరియు 3/2 లు `2x^(2) -5x + 3 = 0` యొక్క మూలాలవుతాయేమో సరిచూడండి.
వర్గమును పూర్తి చేయుట ద్వారా వర్గ సమీకరణమును సాధించే పద్ధతి ద్వారా `5x^2-6x-2 = 0`ను సాధించము.
`4x^(2) + 3x + 5 = 0` ను వర్గమును పూర్తి చేయుట ద్వారా సాధించుము.
సూత్రమును ఉపయోగించి 1వ ప్రశ్చలోని సమీకరణాల మూలాలను కనుగొనుము. `x^(2) + 5 = -6x`
ఒక దీర్చ చతురస్రాకార పార్కు తయారుచేయ ఐడుతుంది. దీని వెడల్పు, పొడవు కంటే 3 మీ. తక్కువ. దీని వైశాల్యము, దీని వెడల్పుకు సమానమైన భూమి మరియు 12మీ. ఎత్తు గల ఒక సమద్విఐహు త్రిభుజ వైశాల్యం కంటే 4 చ.మీ. ఎక్కువ. అయిన దీర్ధ చతుర(స్రాకార పార్కు యొక్క పొడవు, వెడల్పులను కనుగొనుము.
క్రింది సమీకరణాల మూలాలను కనుగొనుము. `x+ 1/x = 3`, `x ne 0`
క్రింది సమీకరణాల మూలాలను కనుగొనుము. `1/x - 1/(x-2) = 3`, `x ne 0,2`
నిశ్చల నీటిలో ఒక మోటారు బోటు యొక్క వేగము గంటకు 18 కి.మీ. నీటి ప్రవాహమునకు ఎదురుగా 24 కి.మీ. ప్రయాణించుటకు పట్టే కాలము, తిరిగి బయలుదేరిన స్థానమునకు వచ్చుటకు పట్టే కాలం కంటే 1 గంట ఎక్కువ. అయిన నీటి వేగమెంత ?
గుప్పెడు మిగిలిపోయిన తడి టీ పొడిని ఒక అద్దుడు కాగితంలో తీసుకొని ఒక ముద్దలా చేయండి. తరవాత దానిని సున్నితంగా ఒత్తి తెరిచి చూడండి. ఏం గమనించారు? అద్దుడు కాగితం టీ ఫొడిలోని నీటిని పీల్చుకుంది కదా! ఈ ప్రక్రియను జీర్ణవ్యవస్థలోని ఏ భాగంతో పోల్చవచ్చు?
`2X^(2) -4x + 3 = 0` యొక్క వితక్షణీని కనుగొని తద్వారా మూలాల స్వభావమును చర్చించుము.
13 సెం.మీ. వ్యాసం గల ఒక వృత్తాకార పార్కు సరిహద్దు మీద ఒక స్తంభమును ఏర్పాటు చేయాలని అనుకున్నారు. పార్కు యొక్క సరిహద్దు మీద ఎదురెదురుగా అనగా ఒక వ్యాసం యొక్క చివరి బిందువుల వద్ద ఏర్పాటు చేయబడిన A మరియు B అనే రెందు గేట్ల నుంచి ఈ స్తంభము వరకూ గల దూరాల భేదము 7 మీ. వుండునట్లు స్తంభమును ఏర్పాటు చేయగలనా ? ఒకవేళ చేయగలిగితే రెండు గేట్ల నుంచి ఈ స్తంభం ఎంత దూరంలో ఉంటుంది ?
`3x^(2) -2x + 1/3 =0` యొక్క విచక్షణిని కనుగొనుము. తద్వారా మూలాల స్వభావమును తెలుపుము. ఒకవేళ మూలాలు వాస్తవ సంఖ్యలైతే వానిని కనుగొనుము.
మూడు వేరువేరు వర్గ సమీకరణాలను తయారు చేయుము. అందులో ఒకటి రెండు వేరువేరు వాస్తవ మూలాలను, మరియొకటి రెందు సమాన వాస్తవ మూలాలను, ఇంకొకటి వాస్తవ మూలాలను కలిగిలేని విధంగా ఉందాలి.
Example questions and complete solutions for chapter వర్ల నమీకరణాలు of VGS MATHS (TELUGU) of Class 10