Class 10 | BIOLOGY |
Chapter | ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 30 |
Academic Year | 2023-24 |
కేవలం మనుగడ కొనసాగించటానికే ప్రత్యుత్పత్తి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా?
జీవులు ఎలా పెరుగుతాయి ? దెబ్బ తగలడం వంటి సందర్భాలలో, పాడైపోయిన, తొలగించబడిన కణాల స్థానం ఎలా భర్తీ అవుతుంది ? ఇందుకోసం ఉపయోగపడే ఏదైనా ప్రత్యేక ప్రత్యుత్పత్తి విధానం ఉందా ?
చేప మరియు కప్పలాంటి జీవులు ప్రతిసారీ అసంఖ్యాకమైన అండాలను విడుదల చేయటానికి గల కారణాలు ఏమిటి?
బాహ్య ఫలదీకరణం అంటే ఏమిటో వివరించండి. ఉదాహరణలు రాయండి.
క్రిందివాని మధ్య గల భేదాలను రాయండి. ఎ) కేసరావళి - అండకోశం బి) సమవిభజన - క్షయకరణ విభజన
మొక్కల్లోని ఫలదీకరణ ప్రక్రియను గురించి వివరించండి.
అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను గురించి తగిన ఉదాహరణలతో వివరించిం.
లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తితో విభేదిస్తుంది? మూడు కారణాలు తెలపండి.
శుక్రకణాలు వాని విధులు నిర్వహించడానికై, ఏ విధమైన అనుకూలనాలను పొంది ఉన్నాయి ?
ఫలదీకరణ చెందిన అండాన్ని గర్భాశయంలో నిలుపుకోవడం కోసం ఋతుస్రావచక్రం పనిచేస్తూ మరియు పునరావృతమవుతూ ఉంటుంది. సాధారణంగా ఋతుచక్రం మొదలై, పూర్తవుటకు ఎంత సమయం తీసుకుంటుంది?
గర్భాశయంలో పెరుగుతున్న పిండానికి పోషణ అవసరం. పిండానికి పోషకాలు ఎలా అందించబడతాయి?
గర్భస్థ శిశువు ఏయే పదార్థాలను తల్లి రక్తం నుండి గ్రహిస్తుంది.
గర్భాశయంలోని ఉమ్మనీటి కోశం (amniotic sac) యొక్క విధి ఏమిటి?
లైంగిక ప్రత్యుత్పత్తి యొక్క లాభాలేమిటి?
జీవజాతుల యొక్క జనాభాలో నిలకడ/శాశ్వతంగా నిలుచుటకోసమై ప్రత్యుత్పత్తి ఎలా సహకరిస్తుంది?
సమవిభజన మరియు క్షయకరణ విభజనల మధ్య భేదాలను రాయండి.
ఋతుస్రావ సమయంలో గర్భాశయ గోడల్లో జరిగే మార్పులేమిటి ?
ఏకకణ జీవులన్నీ అననుకూల పరిస్థితులలో సమవిభజన చెందుతాయి. పై వ్యాఖ్యను సమర్థిస్తారా?
విక్కీ వాళ్ళ నాన్న - రంగురంగుల పూలు మరియు పెద్దవైన ఫలాలు గల క మొక్కను పెంచాలనుకున్నాడు. మీరు అతనికి సూచించే పద్ధతి ఏమిటి? ఎందుకు?
ఉల్లిమొక్క నొకదాన్ని వేర్లతో సహా పెకిలించి, వేరుకొన అడ్డు ఛేదనాలు తీసుకోండి. వాటిని ఏదేని రంగుతో రంజనం చేసి సూక్ష్మదర్శినిని కింద పరిశీలించండి. కణవిభజన దశల బొమ్మలను గీసి, అవి ఏ దశకు చెందినవో గుర్తించండి.
ఆర్థిక ప్రాముఖ్యత గల మొక్కల పెంపకాన్ని మీ జిల్లా మరియు రాష్ర్టాలలో ఏ విధంగా చేపడుతున్నారో తగిన సమాచారాన్ని మీ పాఠశాల గ్రంథాలయం మరియు ఇంటర్నెట్ ల నుండి సేకరించండి. దాని ఆధారంగా ఒక నివేదిక (గ్రాఫ్) తయారుచేయండి.
మీకు దగ్గరలోని గ్రామాన్ని సందర్శించి, అక్కడి రైతులు చెరకు, చామంతి మొదలైన పూలమొక్కలు, బంగాళదుంపలు, దొండకాయలు మొదలైన కూరగాయలు మొదలైన వాటిని ఎలా పండిస్తున్నారో అడిగి తెలుసుకోండి. మీరు సేకరించిన సమాచారంతో తగిన నివేదిక తయారు చేసి, తరగతిలో ప్రదర్శించండి.
సమవిభజనలోని వివిధ దశలతో కూడిన కణచక్రం గురించి ఒక ఫ్లోచార్టును తయారు చేయండి.
పురుష మరియు స్ర్తీ ప్రత్యుత్పత్తి వ్యవస్థల చిత్రాలను గీసి, పేర్లు రాయండి.
ప్రక్క పటంలో చూపిన మొక్క భాగం ఏమిటో గుర్తించండి. దానిపై వ్యాఖ్యరాయండి.
మొక్కలలో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తిని ఫ్లోచార్టు రూపంలో తెలియజేయండి.
మొక్కలలో ఫలదీకరణను వివరించటానికి చక్కని చిత్రాన్ని గీసి పేర్లు రాయండి. పరాగరేణువు గురించి కొన్ని అంశాలను రాయండి.
ఒకవేళ జీవులలో క్షయకరణ విభజన జరగలేదనుకోండి. వాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి?
జీవం శాశ్వతత్వానికి తోడ్పడుతున్న కణవిభజనను నీవు విధంగా అభినందిస్తావు?
లైంగిక వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి మీ అభిప్రాయాలను రాయండి.
Example questions and complete solutions for chapter ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10