Class 10 | BIOLOGY |
Chapter | జీవక్రియలలో సమన్వయం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Question Bank |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ఆవు వంటి జంతువులలో వ్యతిరేక దిశలో పెరిస్టాలి సిస్ జరగకపోతే ఏమవుతుంది?
ఆహారవాహికలో శ్లేష్మం లేకపోతే ఏం జరుగుతుంది ?
క్రింది పట్టికను పూరించండి
జీర్ణమైన ఆహారాన్ని శోషించుకునే చిన్నప్రేగు యొక్క భాగమేది?
పిండిపై లాలాజలం యొక్క చర్యలో ఉపయోగించు రసాయనం ఏది?
రెండు ఆకుపచ్చని పత్రాలలో ఒక దానిని గ్రీజు రాసి ఉంచి, మరొకటి అలాగే వదిలేసి, ఆ రెండు ఆకులపై రెండు చుక్కల ఆమ్లం వేసిన ప్రయోగములో నీవు ఏమి గమనించెదవు?
మానవులలో ఉపజిహ్విక లేకపోతే ఏమి జరగవచ్చు?
ఆహారవాహికలో ఆహారం పెరిస్టాలిక్ చలనాల ద్వారా ముందుకు నెట్టబడి, జీర్ణాశయాన్ని చేరుతుంది. దీన్ని పటము ద్వారా చూపండి. బోలస్ అనగానేమి?
పెరిస్టాల్టిక్ చలనం అంటే ఏమిటి ? ఆహారవాహికలో ఆహార చలనాన్ని, మీరు పాఠశాలలో చేసిన సైకిలు ట్యూబ్లో ఆలుగడ్డ (బంగాళదుంప) కదలిక ప్రయోగంతో పోల్చి వివరించండి.
జీర్ణాశయం సొంత ఆమ్లాల స్రావాల నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో అర్థం చేసుకొనుటకు నిర్వహించిన ఆమ్లం మరియు పత్ర ప్రయోగం విధానాన్ని రాయండి. ఫలితాలను మానవ జీర్ణ వ్యవస్థలో జరిగే అంశాలతో పోల్చండి.
క్రింది వాటికి కారణాలు తెలపండి a) జీర్ణాశయం ఖాళీ అయినపుడు ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి. b) జీర్ణాశయం ఆహారంతో నిండినపుడు ఇంక ఆహారం అవసరం లేదనిపిస్తుంది. c) జలుబు చేసినపుడు ఆహారం రుచిగా ఉండదు. d) ఒక ద్రాక్షపండును నాలుకపై ఉంచినపుడు దాని రుచి మనకు తెలియదు.
మానవ జీర్ణ వ్యవస్థలోని క్రింది భాగాలలో పెరిస్టాలిసిస్ విధులు తెల్పండి. a) ఆహారవాహిక b) జీర్ణాశయం c) చిన్న ప్రేగు d) పెద్ద ప్రేగు
లాలాజలం యొక్క చర్యను అర్థం చేసుకోవటానికి పిండిపై ఎలాంటి ప్రయోగం చేశారు? ప్రయోగ పద్ధతిని మరియు పరికరాలను గురించి వివరించండి.
రుచి నాలుక మరియు అంగిలికి సంబంధించిన విషయం - దీనిని నిరూపించే ఒక కృత్యాన్ని రాయండి.
జీర్ణక్రియ అనగానేమి?
జీర్ణక్రియలో ఏ ఏ జీవక్రియల సమన్వయం పరిశీలించవచ్చు?
ఆకలి సంకేతాలు మెదడులోని ఏ భాగాన్ని చేరతాయి?
రుచులలో భేదం ఎలా కల్గుతుంది ?
ఆహారం రుచిని కనుగొనటంలో అంగిలి పాత్ర ఏమిటి?
మానవ నోటిలో దంతాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
చూర్ణం చేయటం అనగానేమి?
బోలస్ అనగానేమి?
ఆహారంపై లాలాజలం చర్య ఏమిటి?
లాలాజలం యొక్క స్వభావం ఏమిటి?
ఆహారవాహిక పని ఏమిటి?
ఆహారవాహికలోని కదలికలను ఏమంటారు? (లేదా) పెరిస్టాల్ సిస్ అనగానేమి?
జీర్ణాశయం రసాయనికంగా ఏ స్వభావం కల్గి ఉంటుంది?
కైమ్ (Chyme) అనగానేమి?
సంవరిణీ కండరం (Pyloric sphincter) ఎక్కడ ఉంటుంది ? దాని పని ఏమిటి?
ఆహారవాహికలో వ్యతిరేక పెరిస్టాల్ సిస్ ఎప్పుడు జరుగుతుంది?
జీర్ణక్రియలో పాల్గొనే కొన్ని హార్మోన్స్ పేర్లు తెలపండి.
ఆంత్రచూషకాలు (Villi) అనగానేమి? వాటి పని ఏమిటి?
శోషణ అనగానేమి?
రెండవ మెదడుగా దేనిని పరిగణిస్తున్నారు?
మలం అనగానేమి?
కణాలకు శక్తి ఎలా లభిస్తుంది?స
అనియంత్రిత చర్యలు మెదడు ఏ భాగంలో నియంత్రించబడతాయి?
‘ఆకలి కోరికలు’ ఎలా ఏర్పడతాయి?
ఆకలి కోరికలు ఎలా నియంత్రించబడతాయి?
మనం వాసన, రుచిని ఎలా గుర్తించగల్గుతాము?
నిబంధిత, ఉద్దీపన, ప్రతిస్పందనలపై ప్రయోగాలు జరిపిన శాస్ర్తవేత్తలు ఎవరు?
మనకు రోజూ నిర్ధిష్ట సమయంలోనే ఎందుకు ఆకలి వేస్తుంది?
మనకు జలుబు చేసినపుడు ఆహార రుచిని సరిగా గుర్తంచలేము. ఎందుకు?
మనం తినే ఆహారాన్ని, రుచిని ప్రభావితం చేయు అంశాలు ఏమిటి?
నోటిలో జరిగే జీర్ణ్రక్రియలో కండరాల పాత్రను తెలపండి.
నోటి జీర్ణక్రియలో పాల్గొనే వివిధ భాగాలు తెలపండి.
పగలు నిద్రించినపుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది?
ఆహారవాహికలో ఆహారం జారటానికి లాలాజలం ఎలా తోడ్పడుతుంది?
జీర్ణాశయంలో ఆహారం పొందే మార్పులు ఏమిటి?స
ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారం ఎలా నియంత్రించబడుతుంది?
నెమరు వేయటం అనగానేమి? ఇది ఎలా జరుగుతుంది?
ఆహారవాహికలో వ్యతిరేక పెరిస్టాల్ సిస్ ఎప్పుడు జరుగుతుంది?
జీర్ణాశయం స్వంత ఆమ్లాల నుండి ఎలా రక్షణ పొందుతుంది?
పెద్దప్రేగులో మలం ఎలా ఏర్పడుతుంది?
గుప్పెడు మిగిలిపోయిన తడి టీ పొడిని ఒక అద్దుడు కాగితంలో తీసుకొని ఒక ముద్దలా చేయండి. తరవాత దానిని సున్నితంగా ఒత్తి తెరిచి చూడండి. ఏం గమనించారు? అద్దుడు కాగితం టీ ఫొడిలోని నీటిని పీల్చుకుంది కదా! ఈ ప్రక్రియను జీర్ణవ్యవస్థలోని ఏ భాగంతో పోల్చవచ్చు?
మలవిసర్ఝన ఎలా నియంత్రించబడుతుంది?
కణాలలో శక్తి ఎలా వెలువడుతుంది?
మన శరీరంలోని వివిధ వ్యవస్థలు సమన్వయంగా పని చేస్తున్నాయని ఎలా చెప్పగలవు?
నోటి జీర్ణక్రియలో లాలాజల పాత్ర ఏమిటి?
ఆహారవాహికలో ‘బోలస్’ ఎలా క్రిందకు కదులుతుంది?
చిన్నప్రేగుల అంతర నిర్మాణం వర్ణించండి.
రెండవ మెదడు అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
పెరిస్టాల్టిక్ చలనం అంటే ఏమిటి ? ఆహారవాహికలో ఆహార చలనాన్ని, మీరు పాఠశాలలో చేసిన సైకిలు ట్యూబ్లో ఆలుగడ్డ (బంగాళదుంప) కదలిక ప్రయోగంతో పోల్చి వివరించండి.
వ్యతిరేక దిశలో జరిగే పెరిస్టాలిసిస్ దీనిలో చూడవచ్చు.
మానవుని దంతసూత్రం 2/2, 1/1, 2/2. 3/3 ఇందులో 1/1 సూచించేది...............
నీవు చెఱకును చీల్చడానికి ఉపయోగించే దంతాలు......
మన దంతాల అమరిక నిష్పత్తి 3 : 2 : 1 : 2 అయితే దీనిలో 3 దేనిని సూచిస్తుంది?
పటంలో బాణం గుర్తుగల భాగం పేరేమిటి?
జీర్ణాశయపు ప్రతిచర్యకు దాహరణ
బొమ్మలో సూచించిన చోట ఉండే కవాటం
పాక్షికముగా జీర్ణమైన ఆహారము...
నాలుక రుచి గ్రాహకం, కనుక రుచిని గ్రహించుటలో ఏ నాడి ముఖ్యమైనది?
నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం పరిమాణం
జఠర రసములో ఉన్న ఆమ్లము
pH విలువ 7 కంటే తక్కువగా ఉన్న ఆ ద్రావణాలను ........... అంటారు.
మానవునిలో దంత విన్యాసం
మనకు కడుపు నిండుగా ఉండి, ఇంక ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినపుడు ఒక హార్మోన్ స్రవించబడి ఆకలిని అణిచివేస్తుంది. ఆ హార్మోన్ పేరేమిటి?
మానవునిలో జీర్ణ్రక్రియను ప్రారంభించు ఎంజైమ్
పిండి పదార్థాలపై లాలాజలం యొక్క చర్యను నిరూపించుటకు నీవు కారకాన్ని వాడతావు?
పెబ్రినోజెన్ -----g------- పెబ్రిన్ ఈ చర్యలో పాల్గొను ఎంజైమ్ను గుర్తించండి.
రెండవ మెదడు అనగా ....
ఆకలి కోరికలను కలిగంచే హార్మోన్
పెరిస్టాలిక్ చలనం ప్రదర్శించే భాగం
నోటిలో ఏర్పడే ఆహార ముద్ద
జీర్ణాశయ గోడలను ఆమ్ల ప్రభావం నుండి కాపాడునది
తటస్థ పదార్థాల pH విలువ
లాలాజలం యొక్క స్వభావం
పెరిస్టాలిక్ చలనం ప్రదర్శించే భాగం
ఆంత్రమూల ప్రారంభ భాగంలో ఉండే కండరం
జీర్ణాశయంలో ఆహారం నిల్వ ఉండే సమయం
చిన్నపేగులలో ఉత్పత్తి అయ్యే హార్మోన్
చిన్నప్రేగు లోపలి నిర్మాణము
చిన్నప్రేగు ప్రధాన విధి
జీర్ణవ్యవస్థలోని నాడీ మండలాన్ని దేనిగా వ్యవహరిస్తారు?
జీర్ణవ్యవస్థలోని విసర్జన పదార్థం
స్వయంచోదిత నాడీవ్యవస్థను నియంత్రించే మెదడు భాగం
1 2 3 4 ఆహారవాహిక, ఆంత్రమూలం, జీర్ణాశయం, చిన్న ప్రేగు ఈ జీర్ణ వ్యవస్థ భాగాలను వరుసక్రమంలో అమర్చండి
1) జీర్ణాశ్రయం ఖాళీకావటం 2) నాడీ సంకేతాలు ఉత్పత్తికావటం 3) గ్రీలిన్ హార్మోన్ స్రవించటం 4) జీర్ణకోశం నుండి మెదడుకు సంకేతాలు చేరటం. ఈ మార్పులను వరుస క్రమంలో అమర్చండి.
క్రింది వాక్యాలలో అసత్యాన్ని గుర్తించండి.
నోటిలో ఆహారం రుచి ఎప్పుడు తెలుస్తుంది?
Question Bank questions and complete solutions for chapter జీవక్రియలలో సమన్వయం of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10