Class 10 | BIOLOGY |
Chapter | ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
డాక్టరుగారి లాగే మీరు కూడా హృదయస్పందనను లెక్కించవచ్చు. బొమ్మలో చూపిన విధంగా మీ చూపుడువేలు, మధ్య వేళ్ళను మణికట్టు లోపలి వైపుకు బొటనవేలు మణికట్టు కిందివైపుకు కొంచెం నొక్కిపెట్టినట్లుగా పటంలో చూపిన విధంగా ఉంచండి.
మీరు ఏం గమనించారు?
ఒక నిమిషానికి ఎన్ని స్పందనలు వస్తున్నాయో లెక్కించండి.
ఇప్పుడు లేచి నిలబడి ఒక నిముషం పాటు ‘జాగింగ్’ చేయండి. మరలా ఒక నిమిషం పాటు నాడీ స్పందనను లెక్కించండి. మీ తరగతిలోని కొందరు విధ్యార్థుల నాడీ స్పందనలను లెక్కించండి. ఇలా మూడు నమూనాలను లెక్కించి కింది పట్టికలో నమోదు చేయండి.
మీరు ఏం గమనించారు? విశ్రాంతిలోను, జాగింగ్ తర్వాత నాడీ స్పందన ఒకే విధంగా ఉందా?
నాడీ స్పందన రేటు వ్యక్తికి వ్యక్తికి మరియు సందర్భాన్ని బట్టి మారటాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి నాడీస్పందన స్థిరంగా ఉండదని, మనం భయపడినపుడు, ఉద్రేకపడినపుడు నాడీస్పందనరేటు పెరుగుతుందని అర్థమవుతోంది కదూ! మరికొన్ని సందర్భాలలో కూడా ఇలాంటి పరిస్థితిని గమనించవచ్చు. ఉదాహరణకు మనం మెట్లు ఎక్కేటపుడు, పరిగెత్తేటపుడు నాడీస్పందనను పరిశీలించండి.
హృదయస్పందన, నాడీస్పందనల మధ్య గల సంబంధాన్ని గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాడీస్పందనను మరొక విధంగా కూడా గుర్తించవచ్చు. కింది కృత్యాన్ని చేయండి.
ఇందుకోసం మీ సొంత స్టెతస్కోపును తయారు చేసుకోండి. ఒక చొక్కా గుండీని తీసుకోండి. అగ్గిపుల్లను నిటారుగా నిలబడేటట్లుగా గుండీ రంధ్రంలోకి చొప్పించండి. గుండీని మణికట్టు లోపలివైపున పటంలో చూపిన విధంగా ఉంచండి. అగ్గిపుల్లలో కదలికలను జాగ్రత్తగా గమనించండి. దీని సహాయంతో నాడీస్పందనను లెక్కించండి.
మీరు ఏమి గమనించారు?
మన నాడీస్పందన ఎప్పుడు అధికమవుతుంది ?
నాడీస్పందన దేనిని తెలియజేస్తుంది ?
లెన్నెక్ చేసిన ప్రయోగాన్ని మనమూ చేద్దాం. 10 అంగుళాల పొడవు, ఒక అంగుళం వ్యాసం ఉండేట్లుగా ఒక కాగితపు గొట్టాన్ని తయారుచేయండి. మీ స్నేహితుని మెడ నుండి ఆరంగుళాల కిందుగా, రొమ్ము మధ్య భాగానికి ఒక అంగుళం ఎడమవైపున కాగితపు గొట్టం ఒక చివరను ఆనించండి. రెండవ చివర చెవి ఉంచి జాగ్రత్తగా వినండి. ఒక నిమిషంలో ఎన్నిసార్లు హృదయం స్పందిస్తోందో లెక్కించండి. కనీసం పది మంది విద్యార్థుల హృదయస్పందనలను, నాడీస్పందనలను లెక్కించి కింది పట్టికలో నమోదు చేయండి.
పై అంశాల ఆధారంగా హృదయస్పందన, నాడీస్పందనల మధ్య గల సంబంధాన్ని తెలియజేసే గ్రాఫ్ (Histogram) గీయండి. నమూనా గ్రాఫ్ ను పరిశీలించండి. అందులో నీలిరంగు పట్టీలు (a) హృదయస్పందనను, ఎరుపు పట్టీలు (b) నాడీస్పందనను తెలియజేస్తాయి.
హృదయస్పందనకు, నాడీస్పందనకు మధ్యగల సంబంధం ఏమిటి?
హృదయస్పందన రేటు, నాడీస్పందన రేటు ఎప్పుడూ సమానంగా ఉంటాయా?
ధమనులు, సిరల పనితీరును పరిశీలించడానికి కింది కృత్యాలు చేయండి. కాలుమీద కాలువేసుకొని బల్ల మీద కూర్చొండి. ఈ స్థతిలో ఒక మోకాలు మీద మరొక మోకాలు ఆని ఉంటుంది. ఒక పాదం నేలకు ఆని ఉంటే మరొక పాదం గాలిలో తేలుతున్నట్లు ఉంటుంది. ఇలా కొంచెంసేపు కూర్చుంటే హృదయస్పందనలకు లయబద్ధంగా కాలిలో కదలికలు రావడాన్ని మీరు గమనించవచ్చు.
ఇదే భంగిమలో చాలా సేపు కూర్చుంటే వేలాడుతున్న కాలు బరువెక్కినట్లు, సూదులు గుచ్చుతున్నట్లు, తిమ్మిరెక్కినట్లు అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
చేతిలో సిరలు రక్తంతో నిండి ఉబ్బేలా చేతిని గిరగిరా తిప్పండి. తరువాత చేతిని కిందికి జారవిడవండి. పైకి కనపిస్తున్న సిరను మెల్లగా వేలితో నొక్కండి. వ్యతిరేకదిశలో రక్తం ప్రవహించడాన్ని గమనించవచ్చు. కవాటాలకు వ్యతిరేక దిశలో రక్తం ప్రవహిస్తూ సిర ఉబ్బినట్లుగా మీరు గమనించారా ? ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలను మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
ఈ కృత్యాన్ని నిర్వహించడానికి సజ్జలు లేదా ఆవాల విత్తనాలను మొలకెత్తించాలి. తడి అద్దుడు కాగితంపై పెంచిన ఆవాల మొలకలను తీసుకుని పరీక్షించండి. వేర్ల నుండి బయలుదేరిన సన్నని దారాల వంటి నిర్మాణాలను భూతద్దంతో పరిశీలించండి. వీటినే మూలకేశాలు అంటారు. వాటి ద్వారా నీరు మొక్కలలోకి ప్రవేశిస్తుంది. కొంత వేరు భాగాన్ని తీసుకుని దానిపై కొద్దిగా పొడి నీటి చుక్కను వేయండి. కవర్ స్లిప్ తో కప్పి చిదిమినట్లు అయ్యేలా నెమ్మదిగా నొక్కి సూక్ష్మదర్శినిలో పరీక్షించండి. మీరు ఏం గమనించారు ?
నీటి మట్టంలో పెరుగుదల గమనించారా ?
ఈ చర్యలో దారువు పాత్ర ఏమిటి ?
గుండెను కప్పుతూ ఎన్ని పొరలున్నాయి ? (పొరలను కత్తెరతో కత్తిరించి తీసివేయండి.)
గుండె ఏ ఆకారంలో ఉంది ?
గుండెకు అతుక్కుని ఎన్ని రక్తనాళాల చివరులున్నాయి ?
గుండె యొక్క ఏ చివర వెడల్పుగా ఉంది ? ఏ చివర సన్నగా ఉంది?
గుండె గోడలు అంతటా ఒకే మందంతో ఉన్నాయా?
గుండెలో ఎన్ని గదులున్నాయి?
అన్ని గదులు ఒకే పరిమాణంలో ఉన్నాయా?
గుండె గదుల మధ్య ఇంకేమైనా ప్రత్యేకతలను గమనించారా?
గుండె గదులు ఒకదానితో ఒకటి ఎలా కలుపబడ్డాయి?
గుండె గదులు ఒకదానితో ఒకటి ఎలా కలుపబడ్డాయి?
గుండె గదులు ఒకదానితో ఒకటి ఎలా వేరుచేయబడ్డాయి?
గుండె కింది గదులలో తెల్లని నిర్మాణాలను గమనించారా? ఏ భాగాలకు అవి అతుకబడి ఉంటాయి?
గుండెకు ఎన్ని రక్తనాళాలు అతుకబడి ఉన్నాయి?
అన్నిరక్తనాళాలు ధృఢంగా ఉన్నాయా? ఎన్ని రక్తనాళాలు ధృఢంగా ఉన్నాయి?
రక్తనాళాల ధృఢత్వానికి, రక్తప్రసరణకు సంబంధం ఉందని నీవు భావిస్తున్నావా?
ధమనులు, సిరల అడ్డుకోతకు రక్తప్రవాహ వేగానికి సంబంధం ఏమైనా ఉందా?
మానవ హృదయంలో కవాటాలు ఎక్కడెక్కడ ఉంటాయి? వాటి పేర్లు రాయండి.
చేతికి బిగుతుగా కట్టు కట్టినపుడు గుండెకు దూరంగా ఉన్న వైపున రక్తనాళాలు ఎందకు ఉబ్బుతాయి?
శరీరంలో లోపలివైపున ఉన్న రక్తనాళాలను (ధమనులను) బంధించినపుడు అవి హృదయ వైపు ఉబ్బటానికి కారణం ఏమిటి?
గుండెలో కర్ఱికలు, జఠరికల మధ్య కవాటాలు ఉంటాయి. ఈ కావాటాల వలన, సిరలలో ఉండే కవాటాల వలన కలిగే ప్రయోజనం ఒకటేనని నీవు భావిస్తున్నావా?
ధమనులు శరీరం లోపలి భాగంలో ఉంటే, సిరలు శరీరంలో పరధీయ భాగాలలో ఎందుకుంటాయో ఊహించండి.
ధమనులు, సిరలు గురించి ఈ క్రింది పట్టిక పూరించండి.
విలియం హార్వే అందించిన సమాచారం ప్రకారం క్రింది పట్టికను పూరింపుము.
పటం (ఎ) మరియు పటం (బి)లను గమనించండి. పటాలలో ఎక్కడనుండైనా మొదలుపెట్టి బాణపుగుర్తుల మార్గంలో మీ పెన్సిల్ ను కదపండి. మీ మార్గంలో వచ్చిన భాగాలను చక్రీయంగా గుర్తించండి. రెండు ఫ్లోచార్టులను గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పటాలలో వివిధ శరీర భాగాలను గుర్తించే ప్రయత్నం చేయండి.
పటం (ఎ) లో మీ పెన్సిల్ శరీర భాగాల ద్వారా ఎన్నిసార్లు ప్రయాణించింది?
పటం (బి) లో మీ పెన్సిల్ గుండె ద్వారా ఎన్ని సార్లు ప్రయాణించింది?
పటం (బి) లో మీ పెన్సిల్ ఊపిరితిత్తుల ద్వరా ఎన్నిసార్లు ప్రయాణించింది?
కాళ్ళలో ఎందుకు ఇలా వాపు వస్తుంది?
మొక్కలలో కూడా జంతువుల మాదిరిగా రక్తప్రసరణ వ్యవస్థ ఏదైనా ఉందా?
వేర్లు నేలలోని ఖనిజ లవణాలను శోషిస్తుందని మనకు తెలుసు కాని ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎ) దీని వెనుకనున్న యాంత్రికం ఏమిటి? బి) వేర్లు నీటితో నేరుగా సంబంధాన్ని ఏర్పరుచుకుంటాయా? సి) నీరు ఎలా శోషించబడుతుంది?
భాష్పోత్సేకానికి, వర్షపాతానికి ఏమైనా సంబంధం ఉందా?
మీ పరిసరాలలో ఏవైనా చెట్లు, మొక్కల బెరళ్ళను జంతువులు తొలచివేశాయా? పరిశీలించండి. వాటి జాబితా రాయండి. మీ జాబితాలో చెట్లు ఏ జాతికి చెందినవి, నష్టం ఎంత, నష్టం మధ్యనే జరిగిందా, పాతదా, కాండం మీద గీరినట్లుగా జంతువుల పళ్ళగాట్ల గుర్తులు కనిపిస్తున్నాయా?
ధమనుల గోడలు దృఢంగా, స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటాయి. ఎందుకు?
ధమనులను శాఖలుగా విస్తరించిన చెట్టుతో పోల్చుతారు. ఎందుకు?
ధమనులతో పోల్చితే, సిరలలో రక్త ప్రవాహ మార్గం (lumen) పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ఎందుకు?
కార్డియాక్ అన్న పదం మన శరీరంలో ఈ అవయవానికి సంబంధించినది.
గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది?
కింది వానిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది?
ఈ క్రింది వానిలో సరియైనది
ఎఫిడ్ తన తొండాన్ని మొక్కలో............. లోనికి చొప్పించి రసాన్ని పీలుస్తుంది.
అమీబాలో పదార్థాలు రవాణా జరిగే ప్రక్రియ
పదార్థాల రవాణాకు తోడ్పడే వ్యవస్థ
నాడీస్పందన రేటు దేనికి సమానంగా ఉంటుంది?
గుండెలోని పై గదులు
శరీరంలోని పెద్ద ధమని
తక్కువ దృఢత్వం కలిగిన రక్తనాళాలు
శరీర పై భాగాల నుండి రక్తాన్ని తీసుకొచ్చే నాళము
గుండెలోని కవాటాలను అధ్యయనం చేసిన శాస్ర్తవేత్త
మానవుని పిండాభివృద్ధి దశలో గుండె స్పందన ప్రారంభమయ్యే రోజు
గుండె సడలే స్థితి
హార్దిక వలయానికి పట్టే సమయం
ఏకవలయ ప్రసరణ హృదయం కలిగిన జీవి
మానవునిలో నిమిషానికి హృదయస్పందన రేటు
ఘన పదార్థాలు లేని రక్తము
కణజాలాల్లో ఉన్న శోషరసము
మొట్ట మొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం ఏ జీవులలో కనిపిస్తుంది?
వివృత రక్తప్రసరణ వ్యవస్థ గల జీవులు
రక్త పీడనం విలువ
రక్తస్కందనంలో ఏర్పడే పోగులు
రక్త స్కందనానికి పట్టే సమయం
రక్తస్కందనానికి తోడ్పడే విటమిన్
ఏ వ్యాధిలో రక్తస్కందనం జరగదు?
మొక్కలలోని ప్రసరణా కణజాలం
మొక్క దేహ భాగాల నుండి నీరు ఆవిరై పోవడం
మొక్కలలో పోషక పదార్థాలను రవాణా చేయు కణజాలం
రసం పీల్చడానికి ఎఫిడ్స్ ఉపయోగించే భాగం
చెట్టు బెరడులో ఉండే కణజాలం
పిండంలో వేరు వ్యవస్థ చూపే నిర్మాణం
వేరు పీడనాన్ని కొలిచే పరికరం
డాక్టరు రోగి మణికట్టు వద్ద నాడీని పరిశీలించాడు. దీని ద్వారా అతను అంచనా వేయు విషయం
క్రింది వానిలో సరైన వాక్యము ఏది?
హృదయస్పందన రేటుకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి.
ఈ క్రింది వానిలో సరికాని వాక్యము ఏది ? i) కుడి కర్ణిక, ఎడమ కర్ణిక ఆమ్లజని సహిత రక్తం కలిగి ఉంటాయి. ii) కుడి జఠరిక, ఎడమ కర్ణిక ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉంటాయి. iii) కుడి కర్ణిక, ఎడమ జఠరిక ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉంటాయి. iv) కుడి కర్ణిక, కుడి జఠరిక ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉంటాయి.
శరీరంలో మహాధమని పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే
a) బృహద్ధమని- ఊపిరితిత్తులుbr b) అధోధమని- కాళ్ళు, చేతులుbr c)పుపుసధమని- తలbr పైవాటిలో సరిగా జతపర్చబడినవి గుర్తించండి.
ధమని సిరలతో విభేదించని విషయం
ద్వివలయ ప్రసరణ వ్యవస్థ లక్షణం కానిది.
గుండెలో డబ్ అనే శబ్దము ఉత్పత్తి అయ్యే సందర్భము
ధమని కవాటాలు మూసుకోవటం వలన వచ్చే శబ్దం
గుండె సడలే స్థితిలో వచ్చే మార్పు i) ధమని కవాటాలు మూసుకొంటాయి.br ii) కర్ణిక, జఠరిక కవాటాలు మూసుకొంటాయి. briii) లబ్ అనే శబ్దం వస్తుంది. briv) డబ్ అనే శబ్దం వస్తుంది.
ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థ లక్షణం కానిది.
మానవుని రక్తనాళాలతో పోల్చదగిన మొక్క నిర్మాణము
ఎడిమాకు కారణం
Exercise questions and complete solutions for chapter ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10