Class 10 | BIOLOGY |
Chapter | నియంత్రణ - సమన్వయ వ్యవస్థ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
కృత్యం 2 - నాడీకణ నిర్మాణం నాడీకణ శాశ్వత స్లైడెను సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. పటం గీసి, భాగాలను గుర్తించండి.
కృత్యం 3 -మోకాలి లో జరిగే ప్రతీకార చర్య ఒక కాలును మరొక కాలు పైన పెనవేసుకుని కూర్చోండి . దాని వలన కాలు కింద భాగం వేలాడుతూ ఉంటుంది. మోకాలు చిప్ప కింద భాగాన్ని గట్టిగా కొట్టండి . తన ముందు భాగాన్ని మరొక చేతితో గట్టిగా పట్టుకొని తొడ కండరాల లో కలిగే మార్పును గమనించండి. మనం చేతనావస్థలో (Conscious) ఉన్నప్పటికీ తొడ కండరాల సంకోచాన్ని ఆపలేము. అటువంటి ప్రతిచర్యలను అనియంత్రిత చర్యలు అంటాము. మనం ఫుట్బాల్ను అయినప్పుడు అదే తొడ కండరాలు అనియంత్రిత కండరం గా పనిచేస్తుంది
మన శరీరంలో జరిగే క్రియలలో ఎక్కువ భాగం అని యంత్రితంగా ఉంటున్నాయి అనుకుంటున్నారా ?
కృత్యం 4 -అత్తిపత్తి పత్రాలను ముట్టుకొని పత్రాలు ఎలా ప్రతి స్పందిస్తాయో చూడండి. మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు ముడుచుకుని ఉన్నాయా ? ఏ దిశలో ముడుచు కున్నాయి ?
కృత్యం 5 గాజు జాడీ ని తీసుకుని మట్టితో నింపండి . జాడీ గోడ అంచు వెంబడి ఉండేలా చిక్కుడు విత్తనాన్ని నాటండి. ఇలా చేయడం వల్ల విత్తనం మొలకెత్తడానికి కాండం మరియు వేరు పెరుగుదలను చూడవచ్చు . నాలుగైదు రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తడానికి మనం గమనిస్తాం. జాడీ ని సూర్యరశ్మిలో పెట్టండి. కాండము వేరు ఎలా పెరుగుతుందో పరిశీలించండి. మొక్కకు నాలుగైదు ఆకులు వచ్చిన తర్వాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లు గా క్షితిజ సమాంతరంగా ఉంచండి . వారం రోజుల పాటు వేరు మరియు కాండం పెరుగుదలను పరిశీలించండి.
కాండం వారం తర్వాత సమాంతరంగానే పెరుగుతున్నదా?
కాండము యొక్క ఏ భాగము బాగా పెరిగింది? ఏ విభాగంలో పెరుగుదల లేదు ?ఈ మార్పు తీసుకొని వచ్చింది ఏమిటని నీవు భావిస్తున్నావు
ఉద్దీపనలకు ప్రతిస్పందన చూడటానికి సహాయం చేసే వ్యవస్థ ఏది ?
ఉద్దీపనకు ప్రతిస్పందన ద్వారా సంకేతాలు ఇచ్చే వ్యవస్థ ఏది ?
సజీవులు ఈ సంకేతాలకు ఎందుకు ప్రతిస్పందిస్తాయి?
మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని గాలన్ అభిప్రాయానికి రావడానికి కారణం ఏమిటి?
ప్రతీకార చర్యల సందర్భంలో ఇంకా ఎటువంటి ఇతర అవయవాలు నిర్వాహకంగాలుగా పనిచేస్తాయి ?
నాడుల మధ్య సమన్వయం గురించి ఇది ఏమి తెలియజేస్తుంది?
ఏదైనా ఒక పనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ప్రతీకార చర్యా చాపం గీయండి
వెన్నుపాము ఏ ఏ విధులను నిర్వత్రిస్తుందని నీవు భావిస్తున్నావు ?
మన శరీరం నిర్వహించే అన్ని విధులు నేరుగా మెదడు, వెన్నుపాము మాత్రమే నియంత్రిస్తాయని మీరు అనుకుంటున్నారా ఎందుకు ?
మీ అభిప్రాయం ప్రకారం వెన్నుపాములోని ఏమూల జ్ఞాన లేదా అభివాహనాడుల నుంచి సంకేతాలు పొందుతుంది ?
నాడీ అంత్యాలు కండర అంత్యాల వద్ద ఏ విధంగా పనిచేస్తాయని నీవు భావిస్తున్నావు ?
పటమును పరిశీలించండి. కింది ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి ? వెన్నెముకకు దగ్గరగా ఉన్నా గాంగ్లియన్ల నుండి ఏర్పడిన నాడుల ఏ ఏ శరీర అవయవాలకు వెళతాయి ? మెదడు నుండి మొదలయ్యే నాడులు ఏ ఏ అవయవాలకు చేరుకుంటాయి ? సహానుభూత నాడీవ్యవస్థ ఏ ఏ అవయవాల విడుదలపై ప్రభావం చూపుతుంది ? సహానుభూత పర నాడీ వ్యవస్థ ఏ ఏ అవయవాలు విధుల పై ప్రభావం చూపుతుంది ?
సహానుభూత నాడీ వ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏమి అర్థం చేసుకున్నావు ?
సహానుభూత పర నాడీ వ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏమి అర్థం చేసుకున్నావు ?
కోపం ఎంత సమయం ఉంటుందో గమనించారా?
కోపం ఎందుకు తగ్గుతుంది ?
కోపం ఎక్కువ సమయం ఉంటే ఏమవుతుంది ?
రక్తంలో ఎడ్రినలిన్ ఎక్కువగా విడుదలైతే, జీవక్రియల పై ఎలాంటి ప్రభావం ఉంటుంది ?
ఉద్దీపన లకు ప్రతిస్పందనలు చూపే మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి ?
మెదడు లోని అతి పెద్ద భాగము ఏది ?
రెండు నాడీకణాలు కలిసే భాగము ఏది ?
మొక్క అంత్యాలలో (కాండాగ్రం, వేరు అగ్రం) కణాల పొడవు మరియు విభేద విభేదనములకు కారణమైన హార్మోన్ ఏది ?
థైరాక్సిన్ పని ................
జిబ్బరెలిన్ మరియు ఆక్సిన్లు మొక్క పెరుగుదలకు సహకరిస్తే, అబ్ సైసిక్ ఆమ్లం యొక్క పెరుగుదలను నిరోధిస్తుంది. కొన్ని సంఘటనలు ఈ కింద ఇవ్వబడ్డాయి. వీటికి ఏ హార్మోన్ అవసరం అవుతుంది? ఎందుకు ? ఏ) తోటమాలి తన తోటలో పెద్ద పెద్ద తాలియా మొక్కలను పెంచడానికి పోషకాలతో పాటు ............... హార్మోన్ వాడతారు. బి) పొట్టి మొక్కలలో కొమ్మలు మందం గా మారడానికి ..............హార్మోన్ వాడాలి. సి) విత్తనాలను దీర్ఘకాలంగా నిల్వచేయడానికి............. హార్మోన్ వాడాలి . డి) కాండం కొనభాగం కత్తిరించిన తరువాత పార్శ్వ మొగ్గలు పెరగడానికి ...............హార్మోన్ వాడాలి.
ఒక వ్యక్తి తన భావావేశాలు పై నియంత్రణ కోల్పోయాడు. మెదడులో ఏ భాగం పనిచేయడం లేదు ?
అత్తిపత్తి లో ఆకులు ముడుచుకుపోవడం వల్ల జరిగే లాభం
మధుమేహానికి సంబంధించిన గ్రంధి
కింది బొమ్మలోని నాడీ పేరు రాసి అది చేసే పనిని తెలపండి ?
మీ పాఠశాల ప్రయోగశాలలో మీరు చేసిన చిక్కుడు విత్తనాలు మొలకెత్తే కృత్యం లో కాండం మరియు పెరుగుదల గమనించి ఉన్నారు. వారం తరువాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లుగా క్షితిజసమాంతరంగా ఉంచినప్పుడు కాండం పెరుగుదల లో నీవు పరిశీలించి నమోదు చేసిన అంశాలను రాయగలవు.
“మొక్కలు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి” నీవు దీనిపై ప్రాజెక్ట్ నిర్వహించేటప్పుడు ఏ ఏ మొక్కలు సమాచారాన్నిసేకరించి నమోదు చేస్తారు?
మీ పాఠశాల గ్రంథాలయం నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఇన్సులిన్ హార్మోన్ గురించి రెండు వాక్యాలు రాయండి ?
కిటికీ వద్ద పెరుగుతున్న మొక్క సూర్యరశ్మి వైపు వంగుతుంది. ఇలా వంగడానికి కారణం ఏమి?
బొమ్మలో సూచించిన భాగాన్ని గుర్తించి అది చేసే పనిని వ్రాయండి ?
తమను తినే జంతువుల నుండి రక్షించుకొనుటకు మొక్కలు అనుసరించు విధానాలను మీ గ్రామంలో గల రెండు మొక్కలను ఉదాహరణగా తీసుకొని వివరించండి ?
మొక్కలు తమ పరిసరాల్లో కలుగు ఉద్దీపనకు ప్రతిస్పందిస్తాయి అని తెలుసుకున్నప్పుడు నీవెలా అనుభూతి చెందావు ?
మానవ శరీరంలో అధివృక్క గ్రంధి పాత్ర ఏమిటి ?
హార్మోన్లకు, ఎంజైములకు మధ్య గల తేడాలు ఏమిటి ?
జీర్ణక్రియలో ఇమిడి ఉన్న నాడుల సమన్వయాన్ని అర్థం చేసుకోవటానికి ఒక ప్రశ్నావళిని తయారుచేయండి.
అసంకల్పిత ప్రతీకార చర్య లో వెన్నుపాము పాత్రను ఏ విధంగా అభినందిస్తారు ?
ముందు మెదడులోని డైయాన్ సెప్లాన్ మరియు వేగాస్ నాడి (10 వ కపాల నాడీ ) ఆకలి సంకేతాలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి, ‘ఆకలి కోరికలు’ దాదాపు 30 -45 నిమిషాల వరకు కొనసాగుతాయి. గ్రీలిన్ స్థాయి పెరిగినపుడు ఆకలి ప్రచోదలతో పాటు ఆహారం తినాలని ఉద్దీపన భావన కలుగుతుంది. పై విషయం చదివి ఏవైనా రెండు ప్రశ్నలు రాయండి ?
న్యూరాలజిస్టును కలిసినప్పుడు మెదడు యొక్క విధులను గురించి తెలుసుకొనుటకు కొన్ని ప్రశ్నలు రాయండి ?
ఈ దిగువ ఇవ్వబడిన పటములో a, b, c, d లను గుర్తించి వాటి యొక్క విధులు రాయండి ?
పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి ?
హార్మోన్ -
1. పై వాటిలో ఫైటో హార్మోన్ ఏది?
2. మానవుని పెరుగుదల పై ప్రభావం చూపే హార్మోన్ ఏది?
రెండు అనువర్తన చలనాలు ఉదాహరణలతో వివరించండి?
లాంగర్ హాన్ పుటికలు పని చేయకపోతే ఏమి జరుగుతుంది ?
ఈ క్రింది సమాచారాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి
మొక్కల్లో ఉండే హార్మోన్ల ను ఏమంటారు ?
మొక్కల పెరుగుదలకు తోడ్పడే హార్మోన్ ఏది ?
రైతులు వచ్చి మామిడికాయల మధ్యలో కార్బైడ్ ను ఉంచుతారు. దీనికి కారణం ఏమిటి? నాలుగైదు రోజుల తర్వాత ఏమి గమనించవచ్చు?
మొక్కలు కూడా జంతువుల మాదిరిగా ప్రతిస్పందిస్తాయి నీవు దీనిని అంగీకరిస్తావా ని సమాధానాన్ని సమర్థించండి ?
పై పట్టికను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి ?
ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్ ఏది ?
ఒకవేళ టెస్టోస్టిరాన్ స్రవించకుంటే ఏం జరుగుతుంది ?
థైరాక్సిన్ స్రవించే వినాళ గ్రంథి మానవ శరీరంలో ఎక్కడ ఉంటుంది?
స్త్రీలలో, పురుషులలో ఇద్దరిలోనూ ఉండే వినాళ గ్రంధులు ఏవి?
మానవ మెదడు లోని వివిధ భాగాలను తెలిపి అవి నిర్వర్తించే విధులను పట్టిక రూపంలో రాయండి (లేదా) మెదడు లోని ముఖ్యమైన భాగాల పేర్లను తెల్పి, ముందు మెదడు విధులు తెలపండి ?
మొక్కల్లో కనిపించే వివిధ రకాల అనువర్తనాలను ఉదాహరణలతో వివరించండి
1. a) పక్క చిత్రం మన శరీరంలో ఏ వ్యవస్థకు చెందింది ?
b) A మరియు B భాగముల పేర్లు రాయుము ?
c) భాగము ‘C’ ను అతి ప్రధాన వినాళ గ్రంధిగా పిలుస్తారు. దీనిని పేరేమి?
d) పక్క చిత్రం ఏ భాగం సమస్యలను పరిష్కరించడానికి పజిల్స్ పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది ?
మానవుని యొక్క రెండవ మెదటగా ఏ వ్యవస్థ అంటారు? ఎందుకు వివరించండి ?
ఈ క్రింది పట్టికను విశ్లేషించి దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి ?
a) సహానుభూత నాడీ వ్యవస్థ నిర్వహించే రెండు విధులను రాయండి ?
b) సహానుభూత పరనాడీ వ్యవస్థ ప్రభావం చూపే రెండు అవయవాల పేర్లు రాయండి ?
c) పై పట్టిక ప్రకారం రక్తపీడనం పెంచడం పై ప్రభావం చూపే నాడీవ్యవస్థను తెలపండి?
d) ఏయే నాడీ వ్యవస్థలు కలసి స్వయంచోదిత నాడీ వ్యవస్థను ఏర్పరచును ?
హార్మోన్లు అనగానేమి ?
ఫైటో హార్మోన్స్ అనగానేమి? ఉదాహరణలిమ్ము ?
ఉద్దీపనలు అనగానేమి ?
ప్రతిస్పందన అనగానేమి ?
నాడీకణంలోని ప్రధాన భాగాలు ఏమిటి?
నాడీకణ ఆగాజాన్ దేనితో కప్పబడి ఉంటుంది?
పొడవున ఆధారంగా చేసుకొని మెదడు, వెన్నుపాము లలోని ఆగాజాన్స్ డెండ్రైట్ ను గుర్తుపట్టగలరా?
సైనాప్స్ అనగానేమి ?
అభివాహిక నాడులు అనగానేమి ?
చాలక నాడులు అనగానేమి ?
ప్రతి క్రియ, ప్రతి చర్యా చాపం అనగానేమి ?
ప్రతిచర్యలలో ఉద్దీపనల వేగం ఎంత ?
శరీరంలోని నాడీవ్యవస్థను ఎన్ని రకాలుగా విభజిస్తారు?
కేంద్రీయ నాడీ వ్యవస్థ లోని భాగాలు ఏమిటి?
మెదడును రక్షించే నిర్మాణాలు ఏమిటి?
మెదడులోని ప్రధాన భాగాలు ఏమిటి ?
మానవ మెదడు బరువు ఎంత ?
సైనాప్స్ లో సమాచార ప్రసరణ ఎలా జరుగుతుంది ?
మెదడు తీసుకునే ఆక్సిజన్ పరిమాణం ఎంత ?
కపాలనాడులు అనగానేమి?
వెన్నునాడులు అనగానేమి ?
ఎంటరిక్ (Enteric) నాడీ వ్యవస్థ అనగానేమి?
వినాళ గ్రంధులు అనగానేమి?
నాస్తిక్ చలనాలు (nastic movements) అనగానేమి ?
కాంతి అనువర్తనం అనగానేమి ?
గురుత్వ అనువర్తనం అనగానేమి ?
స్పర్శ అనువర్తనం అనగానేమి ?
రసాయనిక అనువర్తన అనగానేమి ?
నులితీగల ప్రయోజనం ఏమిటి ?
నీటి అనువర్తనం అనగానేమి ?
నాడీ వ్యవస్థ గురించి మొదట పరికల్పన చేసిన వ్యక్తి ఎవరు? అతను ఏమని చెప్పాడు ?
మెదడులోని వెలుపలి భాగం బూడిద రంగులో ఉంటుంది. ఎందుకు ?
మెదడు లోపలి భాగాలు తెలుపు రంగులో ఉంటాయి. ఎందుకు ?
పిల్లిని చూచిన ఎలుక పరుగెత్తింది దీనిలోని ఉద్దీపన ప్రతిస్పందనలు ఏమిటి?
నీ నిజ జీవితంలో ఉద్దీపన, ప్రతిస్పందన కు రెండు ఉదాహరణలు ఇవ్వండి ?
క్రికెట్ ఆటలో ఫీల్డర్ వెనుకకు పరిగెడుతూ క్యాచ్ పట్టాడు ఈ సందర్భంలో ఏయే అవయవాలు సమన్వయంగా పని చేస్తాయి ?
చక్కెర వ్యాధి అనగానేమి ?దాని గల కారణం ఏమిటి?
Exercise questions and complete solutions for chapter నియంత్రణ - సమన్వయ వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10